కరీంనగర్ : ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గత ప్రభుత్వాలను విమర్శిస్తూ కాలయాపన చేయడం తప్ప నీటి ఎలా సద్వినియోగం చేసుకోవాలో బోధపడడం లేదన్నారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఎల్లంపల్లి నీటిని వృథా చేయకుండా వెంటనే చెరువులు, కుంటలు నింపాలన్నారు.
-
17న ప్రాజెక్టులపై కాంగ్రెస్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్
-
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
కరీంనగర్ : ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గత ప్రభుత్వాలను విమర్శిస్తూ కాలయాపన చేయడం తప్ప నీటి ఎలా సద్వినియోగం చేసుకోవాలో బోధపడడం లేదన్నారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఎల్లంపల్లి నీటిని వృథా చేయకుండా వెంటనే చెరువులు, కుంటలు నింపాలన్నారు. వేంనూరు, మేడారం, నారాయణపూర్ పంప్‌హౌస్‌లు పూర్తి చేయాలని కోరారు.
ఎస్సారెస్పీ ద్వారా ఎల్‌ఎండీలో నీరు నింపాలన్నారు. ఎల్లంపల్లి నీటిని నారాయణపూర్ రిజ్వర్వాయర్‌కు తీసుకొస్తే వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల ఎద్దడి తొలగుతుందన్నారు. ఈనెల 17న కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రావి నారాయణరెడ్డి సమావేశ మందిరంలో ప్రాజక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయనున్నట్లు తెలిపారు. కర్ర రాజశేఖర్, ఒంటెల రత్నాకర్, దిండిగాల మధు, ఉప్పరి రవి, తాటికొండ భాస్కర్, ఎలగందుల మల్లేశం, సరిళ్ల ప్రసాద్, కటుకం వెంకటరమణ, నాగి శేఖర్, యామ లక్ష్మీరాజం, టేల భూమయ్య తదితరులు పాల్గొన్నారు.