2030 నాటికి చేరుకుంటుంది
నీతి ఆయోగ్ నివేదిక అంచనా
బయో ఎకానమీ 2030 నాటికి 300 బిలియన్ డాలర్లకు (రూ.26.40 లక్షల కోట్లు) విస్తరిస్తుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, ఫిషరీ, ఆక్వాకల్చర్‌ను బయో ఎకానమీగా చెబుతారు. దేశ సార్వ¿ౌమత్వానికి బలమైన వ్యవసాయ రంగం కీలకమని, ఇది ఆహార భద్రతకు భరోసానిస్తుందని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది.
2047 నాటికి వికసిత్ భారత్‌గా అవతరించేందుకు వ్యవసాయ రంగంలో పరివర్తన కీలకమని తెలిపింది. బయో ఎకానమీ వేగవంతమైన విస్తరణతో ఆహార భద్రతకు అదనంగా, దేశ ఆర్థిక వృద్ధికి బలమైన చోదకంగా అవతరించగలదని పేర్కొంది. ‘‘సాగులో ప్రతి దశతోనూ టెక్నాలజీని అనుసంధానం చేసేందుకు వీలుగా ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. చీడపీడలను నివారించడం, ఉత్పాదకత పెంపు, తదుపరి తరం విత్తనాల వినియోగంతో వ్యయాలను తగ్గించుకునేందుకు ఈ తరహా ఆవిష్కరణలు సాయపడతాయి’’అని ఈ నివేదికను విడుదల చేసిన సందర్భంగా గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్ తెలిపారు.
డిజిటల్ అనుసంధానత కేవలం సామర్థ్యాలను మాత్రమే పెంచడం కాకుండా, మన రైతులను సాధికారులను చేస్తుందన్నారు. వాతావరణ మార్పులను తట్టుకోగల విత్తనాలు, ప్రెసిషన్ సాగు (యంత్రాలతో), ఏజెంటిక్ ఏఐ, ఉత్పాదకత పెంపునకు అత్యాధునిక పరికరాల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఈ నివేదిక సూచించింది. దేశంలో ఏ ఇద్దరు రైతులు ఒకే మాదిరిగా ఉండరంటూ, టెక్నాలజీ పరమైన ఆవిష్కరణలు సైతం ఈ వైవిధ్యానికి అనుగుణంగా ఉండాలని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: పెట్టుబడి వెనక్కి తీసుకుంటే పెనాల్టీ కట్టాలా?


