ఉత్సాహంగా రాతిదూలం లాగుడు పోటీలు | doolam competetions in narayanapuram | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా రాతిదూలం లాగుడు పోటీలు

May 22 2017 12:07 AM | Updated on Sep 28 2018 7:36 PM

ఉత్సాహంగా రాతిదూలం లాగుడు పోటీలు - Sakshi

ఉత్సాహంగా రాతిదూలం లాగుడు పోటీలు

హనుమజ్జయంతిని పురస్కరించుకుని ఎ.నారాయణపురం గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన రాతిదూలం లాగుడు పోటీలు ఉత్సాహంగా సాగాయి.

అనంతపురం రూరల్‌ : హనుమజ్జయంతిని పురస్కరించుకుని ఎ.నారాయణపురం గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన రాతిదూలం లాగుడు పోటీలు ఉత్సాహంగా సాగాయి. 8 కాండ్ల ఒంగోలు జాతి ఎద్దులు ఈ పోటీల్లో పాల్గొనగా ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామానికి చెందిన రాజన్న ఎద్దులు ప్రథమ స్థానంలో నిలిచాయి. యల్లనూరు మండలానికి చెందిన రామలింగారెడ్డి ఎద్దులు రెండవ స్థానంలోనూ, ఆత్మకూరు మండలానికి చెందిన రాజగోపాల్‌ ఎద్దులు మూడవ స్థానంలోనూ నిలిచాయి.

నార్పల మండలం జంగంరెడ్డిపేటకు చెందిన రామలింగ వృషభాలు నాల్గో స్థానంలో నిలిచాయి. మొదటి బహుమతిగా రూరల్‌ మండల జెడ్పీటీసీ సభ్యుడు వేణుగోపాల్‌ రూ.20వేలు, రెండవ బహుమతిగా నారాయణపురం గ్రామానికి చెందిన పి.నారాయణస్వామి రూ.15 వేలు, మూడో బహుమతిగా ఎంపీటీసీ సభ్యుడు నాగేంద్ర రూ.10వేలు, నాల్గో బహుమతిగా లక్ష్మీనారాయణ రూ.5వేలు అందజేశారు. అనంతరం గ్రామంలోని అనంత వీరాజంనేయస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement