లక్నవరం అందాలు మరువలేను | dont forget Laknavaram beauty | Sakshi
Sakshi News home page

లక్నవరం అందాలు మరువలేను

Aug 15 2016 2:09 AM | Updated on Sep 4 2017 9:17 AM

ప్రకృతి అందాలతో కళకళలాడుతున్న లక్నవరం సరస్సు అందాలను మరువలేను.. విదేశాలకు వెళ్లిన అనుభూతి కలిగిందని రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ, టూరిజం శాఖ ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనితా రాజేం ద్రన్‌ అన్నారు. ఆదివారం మండలంలోని లక్నవ రం సరస్సును ఆమె సందర్శించారు.

  • టూరిజం ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనితా రాజేంద్రన్‌
  • గోవిందరావుపేట : ప్రకృతి అందాలతో కళకళలాడుతున్న లక్నవరం సరస్సు అందాలను మరువలేను.. విదేశాలకు వెళ్లిన అనుభూతి కలిగిందని రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ, టూరిజం శాఖ ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనితా రాజేం ద్రన్‌ అన్నారు. ఆదివారం మండలంలోని లక్నవ రం సరస్సును ఆమె సందర్శించారు. హరితహా రం కార్యక్రమంలో భాగంగా ఉదయం ఉడెన్‌ కాటేజీలు ఉన్న దీవిలో మొక్క నాటారు. శనివార మే ఇక్కడికి వచ్చిన ఆమె బుగద జలపాతం, మేడారం, రామప్ప పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చి సాయంత్రానికి లక్నవరం చేరుకున్నారు. సరస్సు వద్ద జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతం లో తాము పొందిన హాలిడే అనుభూతులను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఆమె వెంట తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ జిల్లా మేనేజర్‌ నాథన్, లక్నవరం ఇన్‌చార్జి రఘుపతి, సిబ్బంది ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement