దాతల సహకారం అభినందనీయం | doners help must appriciate | Sakshi
Sakshi News home page

దాతల సహకారం అభినందనీయం

Aug 9 2016 10:29 PM | Updated on Sep 4 2017 8:34 AM

దాతల సహకారం అభినందనీయం

దాతల సహకారం అభినందనీయం

ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి దాతలు సహకారం అందించడం అభినందనీయమని పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు తండు వెంకటనారాయణగౌడ్‌ అన్నారు.

నూతనకల్‌: ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి దాతలు సహకారం అందించడం అభినందనీయమని పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు తండు వెంకటనారాయణగౌడ్‌ అన్నారు. మంగళవారం తాళ్లసింగారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు జిల్లా ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ అమెరికాకు చెందిన ప్రతినిధులు రూ.30వేల విలువైన ఫర్నీచర్, ఇంగ్లిష్‌ డిక్షనరీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడ్డప్పటికీ మారుమూల ప్రాంతాల్లో విద్యాభివృద్ధి జరగాలనే లక్ష్యంతో పాఠశాలకు సహకారం అందించి దాత్రుత్వాన్ని చాటుకున్న సంస్థ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. విద్యార్థులు దాతలు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని విద్యారంగంలో రాణించాలని ఆయన కోరారు. ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధులు నాలుగు టేబుల్స్, 17బేంచీలు, ఇంగ్లిష్‌ డిక్షనరీలు, చెస్‌బోర్డులు అందించారు.  ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం. దుర్గాప్రసాద్‌రెడ్డి, సిద్ధిఖ్‌పాష, వర్థెల్లి కృష్ణ, సంధ్యారాణి, మధుకర్, వెంకన్న, ఖదీర్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement