‘ఆశ వర్కర్లను అవమానించడం తగదు’ | Do not insult the asha workers | Sakshi
Sakshi News home page

‘ఆశ వర్కర్లను అవమానించడం తగదు’

Oct 22 2015 1:29 AM | Updated on Sep 3 2017 11:18 AM

వేతనాల పెంపు, బకాయిల కోసం సమ్మె చేస్తున్న ఆశ వర్కర్లను అవమానపరిచేలా రాష్ట్ర మంత్రులు మాట్లాడటం సరికాదని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పేర్కొన్నారు.

సాక్షి, హైదరాబాద్: వేతనాల పెంపు, బకాయిల కోసం సమ్మె చేస్తున్న ఆశ వర్కర్లను అవమానపరిచేలా రాష్ట్ర మంత్రులు మాట్లాడటం సరికాదని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పేర్కొన్నారు. మహిళల పట్ల మంత్రులు తమ అహంకారపూరిత ధోరణి మానుకోవాలని హితవు పలికారు. మూడేళ్ల నుంచి వేతన బకాయిల కోసం విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ఆశ వర్కర్లను అరెస్టు చేయడాన్ని ఖండించారు. బతుకమ్మ పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఆశ వర్కర్ల పట్ల దురహంకారంతో వ్యవహరించడం తగదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement