టీఆర్‌ఎస్‌తో పొత్తు లేదు | Do not alliance with TRS says K Laxman | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌తో పొత్తు లేదు

Jan 20 2017 4:25 AM | Updated on Mar 29 2019 9:31 PM

టీఆర్‌ఎస్‌తో పొత్తు లేదు - Sakshi

టీఆర్‌ఎస్‌తో పొత్తు లేదు

పెద్దనోట్ల రద్దుకు టీఆర్‌ఎస్‌ మద్దతు తెలపడం అభినందనీయమని, అంతమాత్రాన రాష్ట్రంలో ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర బీజేపీదే: కె.లక్ష్మణ్‌

సాక్షి, సూర్యాపేట: పెద్దనోట్ల రద్దుకు టీఆర్‌ఎస్‌ మద్దతు తెలపడం అభినందనీయమని, అంతమాత్రాన రాష్ట్రంలో ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. గురువారం సూర్యా పేటలో విలేకరులతో ఆయన మాట్లాడారు.  రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఉనికి కోల్పోతోందని, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఎదుగుతోందని చెప్పారు. డబుల్‌ బెడ్‌రూం, దళితులకు మూడెకరాల భూపంపిణీ, రైతుల రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదలలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు బీజేపీ ప్రత్యేక ఉద్యమం చేపడుతుందని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement