1998 డీఎస్సీ జాబితా సిద్ధం చేయడంలో జాప్యం | delay in making 1998 dsc qualified list | Sakshi
Sakshi News home page

1998 డీఎస్సీ జాబితా సిద్ధం చేయడంలో జాప్యం

Dec 19 2016 9:43 PM | Updated on Jul 11 2019 5:01 PM

1998 డీఎస్సీ జాబితా సిద్ధం చేయడంలో జాప్యం - Sakshi

1998 డీఎస్సీ జాబితా సిద్ధం చేయడంలో జాప్యం

1998 డీఎస్సీ పరీక్షల్లో అర్హత సాధించిన వారి వివరాలను ఈ నెల 19వతేదీలోగా అందించాలని ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి ఆదేశాలు జారీ చేసినా డీఈఓ కార్యాలయం సిబ్బంది నిర్లక్ష్యం వహించడంపై క్వాలిఫైడ్‌ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

- చివరి తేదీ కావడంతో డీఈఓ ఆఫీస్‌కు చేరుకున్న అభ్యర్థులు
కర్నూలు సిటీ: 1998 డీఎస్సీ పరీక్షల్లో అర్హత సాధించిన వారి వివరాలను ఈ నెల 19వతేదీలోగా అందించాలని ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి ఆదేశాలు జారీ చేసినా డీఈఓ కార్యాలయం సిబ్బంది నిర్లక్ష్యం వహించడంపై క్వాలిఫైడ్‌ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. చివరితేదీ కావడంతో సోమవారం సుమారు వంద మంది  వరకు  కార్యాలయానికి చేరుకుని విషయంపై నిలదీశారు. జాబితా తయారు చేసి పంపించేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లబోమంటూ డీఈఓ కార్యాలయ ఆవరణలోనే బైఠాయించారు.  సాయంత్రం వరకు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే రాత్రి వరకు కూడా జాబితా తయారు కాకపోవడం గమనర్హం. విషయంపై డీఈఓ కె.రవీంద్రనాథ్‌రెడ్డిని వివరణ కోరగా రెండు, మూడు రోజుల్లో  జాబితాను సిద్ధం చేసి పంపుతామని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement