గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ స్టూడెంట్స్ ఎఫైర్స్ ఆఫీసర్‌గా పి.సాయిశివరావు నియమితులయ్యారు. రాజమహేంద్రవరంలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ కళాశాలలో క్రాప్ ఫిజియాలజీ విభాగాధిపతిగా పని చేస్తున్న ఆయన డీన్‌గా పదోన్నతి పొందారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయం స్టూడెంట్ ఎఫైర్స్ డీన్‌గా సాయి శివరావు
Jul 23 2016 11:36 PM | Updated on Sep 4 2017 5:54 AM
కంబాలచెరువు : (రాజమహేంద్రవరం) : గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ స్టూడెంట్స్ ఎఫైర్స్ ఆఫీసర్‌గా పి.సాయిశివరావు నియమితులయ్యారు. రాజమహేంద్రవరంలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ కళాశాలలో క్రాప్ ఫిజియాలజీ విభాగాధిపతిగా పని చేస్తున్న ఆయన డీన్‌గా పదోన్నతి పొందారు. ఈ వివరాలను కళాశాల అసోసియేట్ డీన్ పి.జయరామిరెడ్డి శనివారం విలేకర్లకు తెలిపారు. ఈ సందర్భంగా సాయి శివరావు మాట్లాడుతూ, విశ్వవిద్యాలయ పరి«ధిలోని విద్యార్థుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాజమహేంద్రవరంలో నూతన వ్యవసాయ కళాశాల నిర్మాణానికి తనవంతు సహకారం అందజేస్తానన్నారు. ఆయనను కళాశాల పాలక మండలి సభ్యులు జీవీ నాగేశ్వరరావు, వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ కందుకూరి సీతారామయ్య, అధ్యాపకులు అభినందించారు.
Advertisement
Advertisement