దళిత వాడల అభివృద్ధికి నిధులు | Dalitavadala development to Funds | Sakshi
Sakshi News home page

దళిత వాడల అభివృద్ధికి నిధులు

Jul 16 2016 3:38 AM | Updated on Sep 4 2017 4:56 AM

దళిత వాడల అభివృద్ధికి నిధులు

దళిత వాడల అభివృద్ధికి నిధులు

జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని దళితవాడల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ఎస్సీ, ఎస్పీసీ నిధులు మంజూరయ్యాయని...

రాజాం/రూరల్: జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని దళితవాడల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ఎస్సీ, ఎస్పీసీ నిధులు మంజూరయ్యాయని విశాఖ రీజియన్ మున్సిపల్ శాఖ ఆర్‌డీ ఆశాజ్యోతి తెలిపారు. శుక్రవారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. శ్రీకాకుళం కార్పొరేషన్‌కు రూ. 617 లక్షలు, ఆమదాలవలసకు రూ. 194.61 లక్షలు, ఇచ్ఛాపురానికి రూ.15.67 లక్షలు, రాజాంనకు రూ.49.15 లక్షలు, పాలకొండకు రూ. 16.87 లక్షలు, పలాసకు రూ. 25.09 లక్షలు వంతున నిధులు మంజూరయ్యాయ ఆమె వివరించారు. ఈ నిధులతో దళితవాడల్లోని మురుగు కాలువలు, రహదారులు, సామాజిక భవనాలు నిర్మించుకోవచ్చునన్నారు.

ఇందుకు సంబంధించి త్వరలో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించామన్నారు. అలాగే, 14వ ఆర్థిక సంఘానికి సంబంధించి శ్రీకాకుళంకు రూ. 310.93 లక్షలు, ఆమదావలసకు రూ.105.05 లక్షలు, ఇచ్ఛాపురానికి రూ.102.26 లక్షలు, పలాసకు రూ. 155.35 లక్షలు, రాజాంనకు రూ.121.42 లక్షలు, పాలకొండకు రూ.85.29 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులతో పనులు చేపట్టేందుకు ఏడీపీలో ఆమోదం లభించగా ఆమదావలస, రాజాం, పాలకొండ, పలాసలలో కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభించారని తెలిపారు.

శ్రీకాకుళంలో అమృత పథకంతో ఈ నిధులను జోడించి అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళిక తయారు చేయగా, ఇచ్ఛాపురంలో కౌన్సిల్‌లో ఏర్పడ్డ గొడవలవల్ల ప్రతిపాదనలు కూడా తయారు చేయలేదన్నారు. శతశాతం కుళాయి పాయింట్లు వేయించేందుకు ప్రణాళిక సిద్ధమరుు్యందన్నారు. అలాగే, పెద్ద భవనాలు నిర్మించుకున్నవారు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అంతకు ముందు ఆమె పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు డంపింగ్ యార్డు, వాటర్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పనులు పరిశీలించారు. ఆమె వెంట కమిషనర్ పి.సింహాచలం తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement