తీవ్ర రూపం దాల్చనున్న తుఫాన్! | Cyclone effects more today and rains in north andhra | Sakshi
Sakshi News home page

తీవ్ర రూపం దాల్చనున్న తుఫాన్!

May 20 2016 7:32 AM | Updated on Sep 4 2017 12:32 AM

తీవ్ర రూపం దాల్చనున్న తుఫాన్!

తీవ్ర రూపం దాల్చనున్న తుఫాన్!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ ఇంకా కొనసాగుతోంది. విశాఖకు 110 కి.మీ, కాకినాడకు 60 కి.మీ దూరంలో 'రోను' తుఫాన్ ఉంది.

విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ ఇంకా కొనసాగుతోంది. విశాఖకు 110 కి.మీ, కాకినాడకు 60 కి.మీ దూరంలో 'రోను' తుఫాన్ ఉంది. నేడు తీవ్ర తుఫానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం అందింది. తీరం వెంబడి 90 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. అన్ని ఓడరేవుల్లోనూ 4వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చిరించారు.

వాయుగుండం తీవ్ర తుఫాన్ గా మారి శుక్రవారం ఒడిశా వైపుగా వెళ్లనుంది. శనివారం అర్ధరాత్రి బంగ్లాదేశ్‌లో తీరం దాటొచ్చని ఐఎండీ అధికారులు వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. శ్రీకాకుళం డివిజన్ లో అత్యధికంగా 5 సెం.మీ వర్షపాతం నమోదైంది. తీర ప్రాంత మండలాల రెవెన్యూ సిబ్బందిని కలెక్టర్ అప్రమత్తం చేశారు. సముద్ర తీరంలో అలలు ఎగసి పడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement