దళిత వ్యతిరేక ప్రభుత్వాలను గద్దె దింపాలి


  • సామాజిక హక్కుల వేదిక బస్సు యాత్రలో ప్రజా సంఘాల పిలుపు

  • బాలాజీ చెరువు (కాకినాడ): 

    మార్పు రావాలి...అభివృద్థి« జరగాలి, అందులో వాటా కావాలి, శ్రమ మాది, అధికారం మీకా అంటూ  సీపీఐ ,ప్రజా సంఘాలు, బీసీ, ఎస్‌టి, ఎస్‌టీ సంఘాల నాయకుల నినాదాలతో కాకినాడ నగరం మార్మోగింది. ఎస్‌టి,ఎస్‌టీ బీసీ హక్కుల సాధనకు సామాజిక హక్కుల  వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర మంగళవారం సాయంత్రం కాకినాడ చేరుకుంది. అనంతరం కాకినాడ సూర్య కళా మందిరంలో ఏర్పాటు చేసిన సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, సామాజిక హక్కుల వేదిక కన్వీనర్‌  కె.రామకృష్ణ మాట్లాడుతూ దళితులు, మైనార్టీలు, బీసీల జీవితాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీర్వీర్యం చేస్తున్నాయని అగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌టి,ఎస్‌టీ సబ్‌ప్లా¯ŒSల నిధులు ప్రాజెక్టులకు కేటాయించి మరింత అన్యాయం చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ  ఎమ్మెల్సీ  పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల ప్రజా ప్రతినిధులలో వారికి గౌరవం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇష్టమొచ్చిన హమీలిచ్చి ప్రజలను ఇప్పుడు రోడ్లపైకి లాగుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం బీసీ సబ్‌ప్లా¯ŒSను విస్మరించిందని దుయ్యబట్టారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బేబీరాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ సేవలన్నీ ప్రైవేటీకరణ చెయ్యాలని యోచిస్తుందని, ముఖ్యంగా ఆరోగ్య సేవలను విస్మరించి కార్పొరేట్‌ వైద్యశాలలకు తోడ్పాటునందిస్తుందన్నారు. హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సీటీలో దళిత విద్యార్థి రోహిత్‌ది ఆత్మహత్యకాదని ,ముమ్మాటికి హత్యేనని, దీనిపై విచారణ చెయ్యకపోవడం దురదృష్టకరమన్నారు. అనంతరం బస్సు యాత్రకు సంఘీభావంగా తప్పెటగుళ్ల కళాకారుల నృత్య ప్రదర్శన అకట్టుకుంది .ఈ సభలో  రైతు సంఘ రాష్ట్ర నాయకులు రావుల వెంక య్య, సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, బీసీ సంఘ నాయకులు పంపన రామకృష్ణ, తూతిక విశ్వనా«థ్, ఎస్సీ,ఎస్టీ సంఘ నాయకులు పాల్గొన్నారు.

     

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top