ఆపరేషన్‌ ముస్కాన్‌–2కు సహకరించండి | Cooperate Operation Muskan | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ ముస్కాన్‌–2కు సహకరించండి

Jul 28 2016 1:14 AM | Updated on Sep 4 2017 6:35 AM

మాట్లాడుతున్న బృంద సభ్యులు

మాట్లాడుతున్న బృంద సభ్యులు

ఆపరేషన్‌ ముస్కాన్‌–2 కార్యక్రమానికి అందరి సహకారం అవసరమని మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఎస్‌ఐ ఎం.లక్ష్మయ్య అన్నారు.

ఇచ్ఛాపురం(కంచిలి): ఆపరేషన్‌ ముస్కాన్‌–2 కార్యక్రమానికి అందరి సహకారం అవసరమని మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఎస్‌ఐ ఎం.లక్ష్మయ్య అన్నారు. సమగ్ర బాలల పరిరక్షణ పథకంలో భాగంగా మంగళవారం ఇచ్ఛాపురం, సోంపేట పట్టణాల్లో ఆపరేషన్‌ ముస్కాన్‌ పేరిట తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రదేశాల్లో 23 మంది బాల కార్మికులు, అనాథలను గుర్తించినట్లు తెలిపారు. వీరిని బాలల సంక్షేమ సమితి ముందు హాజరు పరిచి పునరావాసం కల్పిస్తామన్నారు. ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 218 మంది బాలబాలికలను గుర్తించామని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా సమగ్ర బాలల పరిరక్షణ పథకం ప్రాజెక్టు అధికారి ఎం.మల్లేశ్వరరావు, చైల్డ్‌లైన్‌ కో–ఆర్డినేటర్‌ ఆర్‌.జాస్మిన్‌కుమారి, ఎం.స్వాతి, జగదీశ్వర రావు, ఎం.బాలకృష్ణ పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement