పట్టుకోండి.. చూద్దాం! | continuous thefts in anantapur city | Sakshi
Sakshi News home page

పట్టుకోండి.. చూద్దాం!

Sep 13 2017 12:05 AM | Updated on Jun 1 2018 8:45 PM

పట్టుకోండి.. చూద్దాం! - Sakshi

పట్టుకోండి.. చూద్దాం!

వరుస చోరీలు.. చైన్‌ స్నాచింగ్‌లతో నగరం వణికిపోతోంది.

‘గస్తీ’మే సవాల్‌
– వరుస చోరీలతో వణికిపోతున్న నగరం
- పోలీసులకు సవాల్‌ విసురుతున్న దొంగలు
- తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యం
- వయో వృద్ధులు నివసిస్తున్న ఇళ్లలోనే
- అడ్డుకట్ట వేయలేని టెక్నాలజీ


వరుస చోరీలు.. చైన్‌ స్నాచింగ్‌లతో నగరం వణికిపోతోంది. జిల్లా కేంద్రంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న ఘటనలు పోలీసులకు సవాల్‌గా నిలుస్తున్నాయి. గంటల వ్యవధిలో మూడు చోట్ల మహిళల మెడల్లోని గొలుసులు దొంగిలించిన తీరు భయాందోళనకు గురి చేస్తోంది.

16న - భైరవ నగర్‌లో రామిరెడ్డి అనే వృద్ధుడు ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. పట్టపగలే ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఆయన చేతులు కట్టేసి.. నోటికి ప్లాస్టర్‌ వేసి 20 తులాలకు పైగా బంగారం దోచుకెళ్లారు.
18న - మల్లేశ్వర రోడ్డులో ఒంటరిగా నివాసం ఉంటున్న హనుమంతమ్మ అనే వృద్ధురాలి ఇంట్లో దొంగలు పడి 20 తులాల బంగారం ఎత్తుకెళ్లారు.
11న -

అనంతపురం సెంట్రల్‌: ఇంటికి తాళం వేయాలన్నా.. రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లాలన్నా జంకే పరిస్థితి. ఉద్యోగం.. ఉపాధి వేటలో పిల్లలు ఇతర ప్రాంతాల్లో ఉంటూ ఇళ్ల వద్ద ఒంటరిగా ఉండే వయో వృద్ధులు దినదిన గండంగా బతుకీడ్చాల్సి వస్తోంది. నగరంలో ఇప్పుడు దొంగల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పోలీసు శాఖ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నా నేరాల నియంత్రణలో విఫలమవుతుండటం గమనార్హం. నిత్యం ఏదో ఒక చోట వెలుగు చూస్తున్న చోరీలతో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నా.. క్షేత్ర స్థాయిలో ఆశించిన ఫలితాలు కరువయ్యాయి. గస్తీ పోలీసుల విధులు నామమాత్రంగా మారాయనే ఆరోపణలు ఉన్నాయి. సిబ్బంది కొరత.. పని భారం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా బందోబస్తులు అధికం కావడంతోనే నగరంపై పెద్దగా దృష్టి సారించలేకపోతున్నట్లు సమాచారం. కారణం ఏదైయినా.. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు శాఖ దొంగల చేతివాటాన్ని చేష్టలుడిగి చూస్తోంది.

అడ్డుకట్ట వేయలేకపోతున్న టెక్నాలజీ
నేరాలను అదుపు చేసేందుకు ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలు అదుపు చేస్తామని చెబుతున్నారు. అయితే సీసీ కెమెరాలు కేవలం సామాన్య ప్రజలు కాస్త రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు వేసేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయని.. నేరాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయనే విమర్శలకు కారణమవుతున్నాయి. ఇటీవల త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కొంతమంది యువకులు తెల్లవార్లు కార్లు, ఆటోల అద్దాలను ధ్వంసం చేశారు. పోకిరీల చేష్టలను సీసీ కెమెరాల ద్వారా పసిగట్టి అడ్డుకోలేకపోయారు. నగరంలో ద్విచక్రవాహనాల చోరీలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. దొంగ టార్గెట్‌ చేశాడా.. వాహనం క్షణాల్లో మాయమైపోతుంది.

టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కొద్దిరోజుల క్రితం ప్రభుత్వాసుపత్రిలో ఒకటి, రెండురోజుల క్రితం గుల్జార్‌పేటలో ట్రాన్స్‌కో ఏఈ వాహనాన్ని చోరీకి గురయ్యాయి. దొంగ ఎవరన్నది ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు. ఇక చోరీలను అరికట్టేందుకు ప్రతిష్టాత్మకంగా లాక్డ్‌హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం యాప్‌ను తయారుచేశారు. ఇంటికి తాళం వేసి వెళ్లేటప్పుడు యాప్‌ ద్వారా పోలీసుల సాయం కోరితే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సదరు ఇంటికి బందోబస్తు కల్పిస్తున్నారు. అయితే అనుకున్న స్థాయిలో ఈ కార్యక్రమం ప్రజల్లోకి వెల్లడం లేదు. ఈ యాప్‌ వచ్చి ఏడాది కావస్తున్నా 17,173 మంది మాత్రమే రిజస్టర్‌ చేసుకున్నారు. కేవలం 2,277 మంది మాత్రమే వినియోగించుకున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 2.50 లక్షల జనాభా కలిగిన నగరంలో కేవలం 2వేల మంది మాత్రమే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రజల్లో పోలీసు శాఖ నమ్మకం కలిగించలేకపోతుందనే  అభిప్రాయానికి బలం చేకూరుతోంది.

రంగంలోకి ప్రత్యేక బృందాలు
జిల్లా క్రేందలో చైన్‌స్నాచింగ్‌ ముఠాలను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చేపట్టాం. ఇటీవల జరిగిన చైన్‌స్నాచింగ్‌లను తీవ్రంగా పరిగణిస్తున్నాం. సోమవారం నగరంలో మూడు చోట్ల జరిగిన చైన్‌ స్నాచింగ్‌ల వెనుక ఒకే ముఠా ఉన్నట్లు సీసీ ఫుటేజీల ద్వారా తేలింది. చైన్‌స్నాచర్ల ఫొటోలు గుర్తించాం. ఆచూకీ తెలిసిన వారు డయల్‌ 100, 9989819191 నెంబర్‌లకు సమాచారం అందించాలి. ఇదే సమయలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి.
- మల్లికార్జునవర్మ, డీఎస్పీ అనంతపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement