కొనసాగుతున్న సమగ్ర సర్వే | comprehensive survey Ongoing | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న సమగ్ర సర్వే

Mar 7 2017 11:52 PM | Updated on Sep 5 2017 5:27 AM

కొనసాగుతున్న సమగ్ర సర్వే

కొనసాగుతున్న సమగ్ర సర్వే

రైతు సమగ్ర సర్వే పూర్తి సమాచారాన్ని కంప్యూటరీకరించనున్నట్లు చిన్నశంకరంపేట వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు.

చిన్నశకరంపేట: రైతు సమగ్రసర్వే పూర్తి సమాచారాన్ని కంప్యూటరీకరించనున్నట్లు చిన్నశంకరంపేట వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు.  మంగళవారం మండలంలోని కామారం తండాలో రైతు సమగ్రసర్వేలో రైతుల వివరాలు సేకరించారు. సర్వేలో రైతు పేరు, భూమి వివరాలు, నేల స్వభావం, పంటల వివరాలు, సాగు విస్తీర్ణం, బ్యాంకు ఖాతా నంబర్‌ నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సర్వకు రైతులు సహకరించి పూర్తి వివరాలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ రాజు పాల్గొన్నారు.

టేక్మాల్‌: మండలంలోని కుసంగి గ్రామంలో వ్యవసాయాధికారులు మంగళవారం రైతు సమగ్ర సర్వేచేపట్టారు. రైతు కుటుంబాల ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ ఖాతా, పట్టాదారుపాసుపుస్తకం, కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఏఈఓ సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ కలెక్టర్‌ ఆదేశాల మేరకు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. సర్వేలో వీఆర్‌ఏ రాధాకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement