కమ్యూనిస్టులంతా ఐక్యంగా పోరాడాలి | communists must unity to protest | Sakshi
Sakshi News home page

కమ్యూనిస్టులంతా ఐక్యంగా పోరాడాలి

Jul 26 2016 11:55 PM | Updated on Sep 4 2017 6:24 AM

కమ్యూనిస్టులంతా ఐక్యంగా పోరాడాలి

కమ్యూనిస్టులంతా ఐక్యంగా పోరాడాలి

కమ్యూనిస్టులంతా ఐక్యంగా ఉండి ప్రజా సమస్యలపై పోరాడాలని ఎంసీపీఐ (యూ) జిల్లా కార్యదర్శి వస్కుల మట్టయ్య కోరారు.

మిర్యాలగూడ : కమ్యూనిస్టులంతా ఐక్యంగా ఉండి ప్రజా సమస్యలపై పోరాడాలని ఎంసీపీఐ (యూ) జిల్లా కార్యదర్శి వస్కుల మట్టయ్య కోరారు. మంగళవారం స్థానిక సుందరయ్య విగ్రహం వద్ద ఆగస్టు 12న నిర్వహించే ‘సామాజిక న్యాయం – కమ్యూనిస్టుల ఐక్యత’ అనే చర్చిగోష్టి కార్యక్రమ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వస్కుల మట్టయ్య మాట్లాడుతూ చర్చాగోష్టిలో కమ్యూనిస్టులు, మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు, సామాజిక వేత్తలు పాల్గొనాలని కోరారు. కమ్యూనిస్టులు ఐక్యంగా లేకపోవడం వల్ల బూర్జువా పార్టీలు లాభం పొందుతూ ప్రజా సమస్యలను విస్మరిస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) జిల్లా సహాయ కార్యదర్శి నజీర్, డివిజన్‌ కార్యదర్శి కస్తాల సందీప్, నాయకులు రెడపంగ మల్లయ్య, గోపి, భరత్, కాశి, కిరణ్, ప్రసాద్, ప్రేమ్‌కుమార్, సైదులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement