నీలకంఠాపురంలో సామూహిక వివాహాలు | communal marriages in neelakantapuram | Sakshi
Sakshi News home page

నీలకంఠాపురంలో సామూహిక వివాహాలు

Apr 6 2017 11:31 PM | Updated on Sep 5 2017 8:07 AM

నీలకంఠాపురంలో సామూహిక వివాహాలు

నీలకంఠాపురంలో సామూహిక వివాహాలు

మండలంలోని నీలకంఠాపురంలో గురువారం పీసీసీ చీఫ్‌ ఎన్‌.రఘువీరారెడ్డి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో 30 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు చేశారు.

మడకశిర : మండలంలోని నీలకంఠాపురంలో గురువారం పీసీసీ చీఫ్‌ ఎన్‌.రఘువీరారెడ్డి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో 30 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు చేశారు. హాజరైన వారందరికీ భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. గ్రామంలోని శ్రీనీలకంఠేశ్వరస్వామి సన్నిధిలో ఉదయం 8గంటలకు కర్నాటక రాష్ట్రం శిర తాలూకా పట్టనాయకనహళ్ళి శ్రీ నంజావధూతస్వామి ఆశీస్సులతో ఈ వివాహాలు జరిపించారు. ప్రతి ఏడాదీ శ్రీరామనవమి సందర్భంగా రఘువీరారెడ్డి కుటుంబసభ్యులు 1982 నుంచి క్రమం తప్పకుండా సామూహిక వివాహాలు చేయిస్తున్నారు.

వధూవరులకు తాళిబొట్లు, కొత్త బట్టలు, కాలిమెట్టెలు తదితర పెళ్లి సామగ్రిని ఉచితంగా అందిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కోటాసత్యం, స్థానిక మాజీ ఎమ్మెల్యే కె.సుధాకర్, పెనుకొండ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ కేటీ శ్రీధర్, పీసీసీ చీఫ్‌ సోదరుడు చెలువమూర్తి, అనిల్‌కుమార్, స్థానిక కాంగ్రెస్‌ నాయకులు ఎస్‌ ప్రభాకర్‌రెడ్డి, బచ్చలయ్యపాళ్యం నరసింహమూర్తి, నాగేంద్ర, మంజునాథ్, మందలపల్లి నాగరాజు, విశ్వనాథ్‌గుప్త తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement