రైతులు ఉత్పత్తిదారుల సొసైటీలుగా ఏర్పడాలి | coconut day | Sakshi
Sakshi News home page

రైతులు ఉత్పత్తిదారుల సొసైటీలుగా ఏర్పడాలి

Sep 2 2016 11:28 PM | Updated on Mar 21 2019 8:35 PM

రైతులు ఉత్పత్తిదారుల సొసైటీలుగా ఏర్పడాలి - Sakshi

రైతులు ఉత్పత్తిదారుల సొసైటీలుగా ఏర్పడాలి

కొబ్బరి రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి బయటపడాలన్నా.. కొబ్బరి అభివృద్ధి బోర్డు, ప్రభుత్వాల నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు పొందాలంటే వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం (ఫార్మర్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్‌ – ఎఫ్‌పీవో) ఏర్పడాలని జిల్లా కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ అన్నారు.

  • ప్రపంచ కొబ్బరి దినోత్సవ సభలో కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌
  • అమలాపురం/ అంబాజీపేట : 
    కొబ్బరి రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి బయటపడాలన్నా..  కొబ్బరి అభివృద్ధి బోర్డు, ప్రభుత్వాల నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు పొందాలంటే వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం (ఫార్మర్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్‌ – ఎఫ్‌పీవో) ఏర్పడాలని జిల్లా కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ అన్నారు. మాచవరం పంచాయతీ కార్యాలయం వద్ద భారతీయ కిసాన్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో సర్పంచ్‌ సుంకర సత్యవేణి అధ్యక్షతన శుక్రవారంSప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత కొబ్బరి రైతులు మాట్లాడుతూ కొబ్బరి గొడౌన్‌లు ఏర్పాటు చేయాలని, కొబ్బరి ధర కల్పించాలని, ధాన్యం మాదిరిగానే కొబ్బరి కాయలను కొనుగోలు చేయాలని, ప్రభుత్వం రైతులు సమస్యలను గుర్తించి విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని, సంక్షోభంలో ఉన్న రైతులను కాపాడాలని కోరారు. పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, జెడ్పీ చైర్మన్‌ నామన రాంబాబు మాట్లాడుతూ సంక్షోంభంలో ఉన్న కొబ్బరి రైతులను ఆదుకునేలా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. రిలయన్స్‌ ఫౌండేషన్‌ కొబ్బరి రైతులకు ఉచితంగా ఇచ్చిన వర్మీకంపోస్టు బెడ్‌లను కలెక్టర్, జెడ్పీ చైర్మన్‌లు పంపిణీ చేశారు. ఎంపీపీ దాసరి వీరవెంకట సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు బొంతు పెదబాబు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అరిగెల బలరామమూర్తి, సొసైటీ అధ్యక్షుడు గణపతి వీరరాఘవులు, అమలాపురం ఆర్డీవో జి.గణేష్‌కుమార్, ఎంపీడీఓ తూతిక శ్రీనివాస్‌ విశ్వనాథ్, తహసీల్దారు బి.శ్రీనివాస్, బీకేఎస్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. 
    బాధిత మహిళల కోసం ప్రత్యేక కేంద్రం
    కాకినాడ సిటీ : జిల్లాలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాధిత మహిళల కోసం ప్రత్యేక కేంద్రం (ఒన్‌స్టాప్‌ సెంటర్‌) ఏర్పాటు పరిశీలనలో ఉందని కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో జిల్లాలో జరుగుతున్న అంగన్‌వాడీ భవన నిర్మాణ ప్రగతిని అధికారులతో సమీక్షించారు. ఈ కేంద్రం ద్వారా వివిధ సంఘటనల్లో బాధితులైన మహిళలకు వైద్య, న్యాయం సహాయం, కౌన్సెలింగ్‌ వంటి సౌకర్యాలు కల్పిస్తారన్నారు. ఈ కేంద్రం తాత్కాలికంగా కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటుకు అనువైన ప్రదేశాన్ని పరిశీలించాలని  ఇన్‌చార్జి ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ టి.ప్రవీణకు కలెక్టర్‌ సూచించారు. జిల్లాలో 450 అంగన్‌వాడీ కేంద్రాలలో ఎల్‌పీజీ గ్యాస్‌ సదుపాయం లేదని, 1,132 కేంద్రాలకు స్టౌలు కావాలని, ఈ మేరకు రూ.2లక్షల విడుదల చేయాలని, మహిళా అభివృద్ది, శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ చక్రవర్తిని ఫోన్‌ ద్వారా కలెక్టర్‌ కోరారు. జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణ ప్రగతిని కూడా కలెక్టర్‌ సమీక్షించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement