చొక్కారావు సేవలు చిరస్మరణీయం | chokkarao is a honest man | Sakshi
Sakshi News home page

చొక్కారావు సేవలు చిరస్మరణీయం

Jul 19 2016 11:56 PM | Updated on Mar 18 2019 9:02 PM

కరీంనగర్‌ : మాజీ ఎంపీ, స్వర్గీయ జువ్వాడి చొక్కారావు 93వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మహేశ్‌కుమార్‌గౌడ్, గొడుగు గంగాధర్, మాజీ ఎంపీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ చొక్కారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

  • ఘనంగా చొక్కారావు జయంతి
  • నివాళి అర్పించిన కాంగ్రెస్‌ నాయకులు
  • కరీంనగర్‌ : మాజీ ఎంపీ, స్వర్గీయ జువ్వాడి చొక్కారావు 93వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మహేశ్‌కుమార్‌గౌడ్, గొడుగు గంగాధర్, మాజీ ఎంపీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ చొక్కారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జువ్వాడి ఎంపీగా.. మంత్రిగా.. తెలంగాణ ప్రాంత బోర్డు సభ్యులుగా పనిచేసి తెలంగాణ అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు కర్ర రాజశేఖర్‌ ఆధ్వర్యంలో చొక్కారావు విగ్రహానికి టీపీసీసీ ఎస్సీసెల్‌ అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉప్పరి రవి, దిండిగాల మధు, చెర్ల పద్మ, గందె మాధవి, వాల రమణారావు, అజిత్‌రావు, వేదం, మాదాసు శ్రీనివాస్, మూల జైపాల్, వెన్న రాజమల్లయ్య, కల్వల రాంచందర్, గడ్డం విలాస్‌రెడ్డి, ప్రశాంత్‌దీపక్, బాశెట్టి కిషన్, పోతారపు సురేందర్, ఇమ్రాన్, వీరస్వామి, తాళ్లపెల్లి అంజయ్యగౌడ్, బాలరాజు, నాయక్, చంద్రయ్య, శ్రావణ్‌నాయక్, సతీష్‌రావు, రమేశ్, శ్రీనివాస్, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.
    యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో...
    యూత్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు జువ్వాడి నిఖిల్‌ చక్రవర్తి ఆధ్వర్యంలో వివేకానంద డిగ్రీ కళాశాలలో జయంతిని నిర్వహించారు. కళాశాల విద్యార్థులకు ‘నేటి భారతదేశ రాజకీయాలలో నీతి, నిజాయతీ–నిరాడంబరత’ అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వంద మంది విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, ఎస్సీసెల్‌ రాష్ట్ర చైర్మన్‌ ఆరెపల్లి మోహన్, అసెంబ్లీ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు పాల్గొన్నారు. నాయకులు పోతారపు సురేందర్, బండి సంపత్, శ్రావణ్, ఇమ్రాన్, హరీష్, అరుణ్, రమేశ్, తిరుపతి, స్వామి, ప్రశాంత్, సుధీర్, సునీల్, స్వామి, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement