స్వైన్‌ఫ్లూతో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సోమవారం రాత్రి మృతి చెందాడు.
గుడిపాల(చిత్తూరు జిల్లా): స్వైన్‌ఫ్లూతో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గుడిపాల మండలంలోని రెట్టగుంటకు చెందిన మోహన్‌నాయుడు (43) కొంతకాలంగా ఆస్తమాతో బాధపడుతున్నాడు. వ్యాధి తీవ్రరూపం దాల్చడంతో వారం క్రితం అతడిని కుటుంబ సభ్యులు వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చేర్పించారు.
అయితే మూడు రోజుల క్రితం చేసిన వైద్య పరీక్షల్లో అతడు స్వైన్‌ఫ్లూ బారిన పడినట్లు నిర్ధారణైంది. పరిస్థితి విషమించి కోమాలోకి జారుకున్నాడు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.