మరో వివాదంలో ఎమ్మెల్యే చింతమనేని | Chintamani Prabhakar in another Controversy | Sakshi
Sakshi News home page

మరో వివాదంలో ఎమ్మెల్యే చింతమనేని

Feb 10 2016 4:24 PM | Updated on Sep 3 2017 5:22 PM

మరో వివాదంలో ఎమ్మెల్యే చింతమనేని

మరో వివాదంలో ఎమ్మెల్యే చింతమనేని

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే చింతమనేని తనపై దాడి చేశారని ఏలూరుకు చెందిన పోలీసు కానిస్టేబుల్ మధు జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. ఇటీవల ఓ సివిల్ తగాదాలో చింతమనేని జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో కానిస్టేబుల్ మధుపై దాడి చేసినట్లు సమాచారం.

ఇప్పటికే ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో డి.వనజాక్షిపై చింతమనేని ప్రభాకర్తో పాటు ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే కోల్లేరు ప్రాంతంలో అటవీశాఖ నిబంధనలకు విరుద్ధంగా రహదారిని నిర్మించారు. అదికూడా ఆటవీశాఖ అధికారుల సమక్షంలోనే చోటు చేసుకోవడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement