మద్దికెర గ్రామంలో 40 క్వింటాళ్ల మిరపపంట అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది.
మిరప పంట దగ్ధం
Mar 19 2017 11:36 PM | Updated on Oct 1 2018 2:44 PM
మద్దికెర: మద్దికెర గ్రామంలో 40 క్వింటాళ్ల మిరపపంట అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. దాదాపు రూ.4 లక్షలు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. గ్రామానికి చెందిన రైతు ఉమామహేశ్వరరావు వేలాది రూపాయలు అప్పులు చేసి ఎండు మిర్చి పంటను సాగు చేశాడు. పంటను కోసి తోటలో ఎండబెట్టాడు. ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు పంటకు నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమైంది.స్థానిక రైతులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఫైరింజన్‌తో చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే పంట మొత్తం దగ్ధమైంది. మద్దికెర పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ అబ్దుల్‌జహీర్ తెలిపారు.
Advertisement
Advertisement