గూళ్యపాళ్యంలో చిరుత కలకలం | cheatahs hulchal in gulyapalem | Sakshi
Sakshi News home page

గూళ్యపాళ్యంలో చిరుత కలకలం

Sep 12 2016 12:20 AM | Updated on Sep 4 2017 1:06 PM

మండల పరిధిలోని గూళ్యపాళ్యం గ్రామంలో ఆదివారం చిరుత కనపడటంతో గ్రామస్తులు బెంబేలెత్తుతున్నారు.

గూళ్యపాళ్యం (వజ్రకరూరు) : మండల పరిధిలోని గూళ్యపాళ్యం గ్రామంలో ఆదివారం చిరుత కనపడటంతో గ్రామస్తులు బెంబేలెత్తుతున్నారు.  గ్రామ సమీపంలో ఉన్న కొండపై చిరుత కూర్చుని ఉన్న దృశ్యాన్ని గ్రామస్తులు గమనించారు.చిరుత ఉన్న విషయం దావనంలా వ్యాపించడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని చిరుతను చూసేందుకు గుమిగూడారు.

అనంతరం చిరుత అక్కడి నుంచి కొండలో ఉన్న గుహలోకి వెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు.  సాయంత్రం కూడా మరోమారు చిరుత గుహలో నుంచి బయటకు వచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు. చిరుత సంచారం ఉన్నట్లు సమాచారం రావడంతో ఎస్‌ఐ జనార్ధన్‌ నాయుడు అక్కడకు చేరుకుని చిరుత సంచారం ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement