వైకుంఠ రథం ధ్వంసం | chariot collapsed | Sakshi
Sakshi News home page

వైకుంఠ రథం ధ్వంసం

Sep 26 2016 11:46 PM | Updated on Sep 4 2017 3:05 PM

ధ్వంసమైన వైకుంఠ రథం అద్దం

ధ్వంసమైన వైకుంఠ రథం అద్దం

పట్టణంలో మృతిచెందిన వారి పార్థివ దేహాలను శ్మశానానికి ఉచితంగా తరలిస్తున్న వైకుంఠ రథాన్ని ఆదివారం రాత్రి ఒక మందుబాబు ధ్వంసం చేశాడు.

మదనపల్లె:పట్టణంలో మృతిచెందిన వారి పార్థివ దేహాలను శ్మశానానికి ఉచితంగా తరలిస్తున్న వైకుంఠ రథాన్ని ఆదివారం రాత్రి ఒక మందుబాబు ధ్వంసం చేశాడు. స్థానిక అవెన్యూ రోడ్డులో నిలిపిన వాహనం అద్దం పగలకొట్టాడు. వైకుంఠ రథంపై దాడి చేయడం తగదని నిర్వాహకుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు పేర్కొన్నారు. సొంత నిధులతో వాహనాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో వాహనం టైరు చోరీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా పోలీసులు, పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement