
ఒకప్పుడు మన రూపాన్ని చూసుకోవడానికి మాత్రమే ఇంట్లో అద్దాలు ఉండేవి. ఇప్పుడు ఇంటి అలంకరణలో అద్దం అంతర్భాగంగా మారింది. ఇంటీరియర్ థీమ్‌కి అనుగుణంగా థీమ్డ్ మిర్రర్స్‌ను డిజైన్ చేస్తున్నారు నిపుణులు. వీటి రూపకల్పనలోనే డిజైనర్లు తమదైన ప్రతిభ చూపుతున్నారు. ఇంటికి వినూత్న కళను తీసుకువస్తున్నారు. మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే డెకరేషన్ వస్తువులుగా మారిన అద్దాలను సరైన థీమ్‌తో ఎంపిక చేసుకుంటే, అది కేవలం అద్దం మాత్రమే కాకుండా ఒక కళాఖండంగానూ మారుతుంది.
పెద్ద గదులకు థీమ్ మిర్రర్స్
వింటేజ్ థీమ్ మిర్రర్ డిజైన్స్‌లో పాతకాలపు డిజైన్లు కనిపిస్తాయి. కార్వింగ్‌తో ఉండే వుడ్ లేదా బ్రాస్ ఫ్రేమ్స్ 19వ శతాబ్దపు ఛాయలు కనిపిస్తాయి. బొహిమియన్ స్టైల్‌లో చూపులను తిప్పుకోనివ్వని రంగులు, కార్వింగ్ డిజైన్లు కనువిందు చేస్తాయి.
చిన్నగదులకు సింపుల్ మిర్రర్స్
అద్దాలు అలంకరణలో కీలకం అని, నచ్చింది కదా అని మన ఇంటి గదుల నిర్మాణం గురించి ఆలోచించకుండా ఎంచుకోవచ్చు. చిన్న గదులకు క్లియర్ లైసెన్స్, సింపుల్ డిజైన్, న్యూట్రల్ కలర్స్, మెటల్ ఫ్రేమ్స్ చక్కగా నప్పుతాయి. ఇవి రూ.500 నుంచి లభిస్తున్నాయి.
ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందే మిర్రర్స్
పువ్వులు, లతలు, ఆకులతో మిర్రర్ ఔట్ డిజైన్స్, వుడ్ టెక్స్చర్, ప్రకృతిని ప్రతిబింబించే రూపాలు వీటిలో కనిపిస్తాయి. ఇవి పెద్ద హాల్, డైనింగ్ ఏరియాలో సెట్ అవుతాయి. కార్టూన్ క్యారెక్టర్స్, యానిమల్ షేప్స్‌వి కిడ్ రూమ్ డెకరేషన్‌కు బాగా సరిపోతాయి.
ఉన్నదాని కన్నా గది విశాలంగా చూపాలంటే థీమ్డ్ మిర్రర్ వర్క్ బాగా ఉపయోగపడుతుంది. ఇంటి వాల్ కలర్, ఫర్నిచర్‌తో సరిపోయేలా మిర్రర్ డిజైన్ ఎంచుకోవాలి. ఇలాంటివి ఆన్‌లైన్ మార్కెట్‌లోనూ దొరుకుతున్నాయి. మోడల్, వింటేజ్ స్టైల్ థీమ్‌ను బట్టి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మార్కెట్‌లో మిర్రర్స్ లభిస్తున్నాయి.
ఎన్నార్
(చదవండి: చేపలంటే నోరూరించే వంటకాలు కాదు..! ఇకపై ఫ్యాషన్..)