తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ప్రజా ఉద్యమాలను అణచివేస్తూ సహజ వనరులను కార్పొరేట్ పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని మావోయిస్టు పార్టీ పేర్కొంది.
సాక్షి, వరంగల్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ప్రజా ఉద్యమాలను అణచివేస్తూ సహజ వనరులను కార్పొరేట్ పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఇద్దరు సీఎంలు పిరికిపందల యుద్ధనీతిని అమలు చేస్తున్నారని.. వెంటనే దీన్ని మార్చుకోవాలని హెచ్చరించింది.
మావోయిస్టు పార్టీ ఖమ్మం-కరీంనగర్-వరంగల్ జిల్లాల కార్యదర్శి దామోదర్ పేరుతో శుక్రవారం ‘సాక్షి’ కార్యాలయానికి లేఖ వచ్చింది. ఏఓబీ ఎన్‌కౌంటర్ బూటకమని, ఇది మావోయిస్టు పార్టీకి నష్టమేనని, కానీ కొద్దిరోజుల్లోనే నిలదొక్కుకుని తిరిగి విస్తరిస్తామని, ప్రజాద్రోహులను ఖతం చేస్తామని లేఖలో ఆయన పేర్కొన్నారు.