వరద బాధితులను ఆదుకోవడంలో అధికారుల పనితీరు సరిగా లేదంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెల్లూరు: వరద బాధితులను ఆదుకోవడంలో అధికారుల పనితీరు సరిగా లేదంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద పరిస్థితిపై శనివారం నెల్లూరులో చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రజలు ఇంకా వరద నీటిలోనే మగ్గుతున్నారని, వరద బాధితులకు తక్షణమే సాయం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. వరద బాధితులకు సాయం చేయడంలో టీడీపీ శ్రేణులు కూడా సరిగా స్పందించడంలేదని అన్నారు.