అలరించిన సంగీత విభావరి | Catering for concert performance | Sakshi
Sakshi News home page

అలరించిన సంగీత విభావరి

Jan 1 2017 11:13 PM | Updated on Sep 5 2017 12:08 AM

అలరించిన సంగీత విభావరి

అలరించిన సంగీత విభావరి

నూతన సంవత్సర వేడుకలలో భాగంగా శృతిసినీఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి విశేషంగా అలరించింది.

బద్వేలు అర్బన్‌: నూతన సంవత్సర వేడుకలలో భాగంగా శృతిసినీఆర్కెస్ట్రా  ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి  విశేషంగా అలరించింది.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొల్ల సాహితీపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు విద్వాన్‌గానుగపెంట హనుమంతరావు మాట్లాడుతూ  ప్రస్తుత ఉరకల, పరుగుల జీవితంలో ఎన్నో ఒత్తిడులు , ఆటుపోట్లు ఎదురవుతుంటాయని  అలాంటి సమయంలో పాటలు వినడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని   పాటలకు అంతగొప్పశక్తి ఉందన్నారు.  అలాగే ప్రభుత్వం కళాకారులకు ఆర్థిక చేయూతనందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం గాయకులు లక్కినేని వినయ్‌కుమార్, శ్రేయలు ఆలపించిన గీతాలు, శ్రీ కళాఆర్ట్స్‌ అకాడమి విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలను ఆకట్టుకున్నాయి.  కార్యక్రమంలో విశ్రాంత తెలుగు అధ్యాపకులు రంగరాజు, విశ్రాంత ఉద్యోగులు సిహెచ్‌కె. నరసింహులు, మల్లారెడ్డి, రాణా ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement