సైకిలిస్టును ఢీకొట్టిన సంఘటన లో ద్విచక్రవాహనదారుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరికృష్ణ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన గుడిగంటి విఘ్నేష్ ఈనెల 8వ తేదీన సైకిల్ పై వెళ్తున్నాడు.
ఒకరిపై కేసు నమోదు
Aug 16 2016 12:33 AM | Updated on Sep 4 2017 9:24 AM
	నర్సంపేట : సైకిలిస్టును ఢీకొట్టిన సంఘటన లో ద్విచక్రవాహనదారుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరికృష్ణ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన గుడిగంటి విఘ్నేష్  ఈనెల 8వ తేదీన సైకిల్ పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా ద్విచక్రవాహనంపై నూనెరోహిత వచ్చి విఘ్నేష్‌ను ఢీకొట్టాడు, దీంతో విఘ్నేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే విఘ్నేష్ తండ్రి ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు రోహిత్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
