రేపు ‘బాబు’పై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు | case files against chandrababu tomorrow | Sakshi
Sakshi News home page

రేపు ‘బాబు’పై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు

Jun 7 2016 9:24 AM | Updated on Jul 28 2018 3:33 PM

రేపు ‘బాబు’పై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు - Sakshi

రేపు ‘బాబు’పై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు

ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా మోసగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఈ నెల 8వ తేదీన పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టాలి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు పిలుపు
 
కాకినాడ : ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా మోసగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఈ నెల 8వ తేదీన పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ  పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
 
 ఆయా నియోజకవర్గాల్లోని మెయిన్‌రోడ్డు లేదా ప్రధాన కూడళ్ళల్లో పార్టీ శ్రేణులంతా సమావేశమై రెండేళ్ళ తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ప్రజలను వంచించిన తీరుపై చైతన్యవంతం చేయాలన్నారు. ఎన్నికల హామీలను విస్మరించిన దగాకోరు తనాన్ని ఎండకట్టాలన్నారు. ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో సమీపంలోని పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేయాలన్నారు. ఆయా నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు ముఖ్యనేతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని కన్నబాబు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement