భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు బోల్తాపడింది.
నల్లగొండ: టూరిస్ట్ బస్సు బోల్తాపడటంతో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన నార్కట్‌పల్లి మండలం గోపలాయపల్లి వద్ద చోటు చేసుకుంది.
బీఎస్‌ఆర్ ట్రావెల్స్‌కు చెందిన టూరిస్ట్ బస్సు భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా గోపలాయపల్లి వద్ద అదుపుతప్పడంతో రోడ్డు పక్కన బోల్తాకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్ల తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.