నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం బీబీగూడెం శివారులో బుధవారం తెల్లవారుజామున ఆర్టీసీ ఇంద్రా బస్సు బోల్తా పడింది.
చివ్వెంల: నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం బీబీగూడెం శివారులో బుధవారం తెల్లవారుజామున ఆర్టీసీ ఇంద్రా బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ఖమ్మం డిపోకు చెందిన ఇంద్రా బస్సు హైదరాబాద్‌కు వెళుతూ జేసీబీని తప్పించబోయి అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని సూర్యాపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. బస్సులోని 25 మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.