మృత్యుకోరల్లో బాలుడు | boy needs help | Sakshi
Sakshi News home page

మృత్యుకోరల్లో బాలుడు

Aug 24 2016 11:37 PM | Updated on Sep 4 2017 10:43 AM

కుమారుడు దినేష్‌తో తల్లిదండ్రులు దుర్గారావు,రాధ

కుమారుడు దినేష్‌తో తల్లిదండ్రులు దుర్గారావు,రాధ

మండలంలోని తెట్టంగి గ్రామానికి చెందిన వలస కూలీలు ముంజి దుర్గారావు, రాధ దంపతుల ఏడేళ్ల కుమారుడు దినేష్‌ బోన్‌మేరో వ్యాధితో బాధ పడుతున్నాడు. కొద్ది రోజుల్లో చికిత్స చేయించకపోతే బాలుడు చనిపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పడంతో బాలుడి తల్లిదండ్రులు నరకం చూస్తున్నారు. కుమారుడిని ఎలా కాపాడుకోవాలో తెలీక తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

 బోన్‌మేరో వ్యాధితో బాధ పడుతున్న ఏడేళ్ల బాలుడు
 చికిత్స చేయించకపోతే ప్రాణాలకే ముప్పు అంటున్న వైద్యులు
 సాయం కోసం తల్లిదండ్రుల అభ్యర్థన
 

కూలి చేసుకుని బతికే ఆ కుటుంబం ఇప్పుడు కష్టాల్లో పడింది. ఏడేళ్ల బాలుడిని బతికించుకోవడానికి నరకయాతన పడుతోంది. చేతిలో ఉన్న డబ్బులు చాలక, చికిత్స చేయించేందుకు స్థోమత లేక నిత్యం నరకం చూస్తోంది. బోన్‌మేరోతో బాధ పడుతున్న కుమారుడిని బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు. చికిత్సకు మరికొద్ది రోజులే గడువు ఉండడంతో కొడుకు ప్రాణాలు కాపాడడానికి ఆ దంపతులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆశల దీపాన్ని కాపాడుకోవడానికి సాయం కోరుతున్నారు. చికిత్స చేయించడం తలకు మించిన భారం కావడంతో చేయూత కోరుతున్నారు. 

– తెట్టంగి (వీరఘట్టం)

మండలంలోని తెట్టంగి గ్రామానికి చెందిన వలస కూలీలు ముంజి దుర్గారావు, రాధ దంపతుల ఏడేళ్ల కుమారుడు దినేష్‌ బోన్‌మేరో వ్యాధితో బాధ పడుతున్నాడు. కొద్ది రోజుల్లో చికిత్స చేయించకపోతే బాలుడు చనిపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పడంతో బాలుడి తల్లిదండ్రులు నరకం చూస్తున్నారు. కుమారుడిని ఎలా కాపాడుకోవాలో తెలీక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీరి బాధను చూడలేక గ్రామానికి చెందిన 10 మంది యువకులు చందాలు సేకరించేందుకు నడుం బిగించారు. ఇప్పటికే తెట్టంగి, పాలకొండ పరిసర విద్యాసంస్థల్లో వారికి తెలిసిన వారి నుంచి రూ.70 వేల వరకు వసూలు చేసి ఇచ్చారు. కానీ ఆపరేషన్‌ చేయాలంటే ఇంకా ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో దాతల కోసం ఆ తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూస్తున్నారు.   

 
 తల్లిదండ్రులు కూలి పనులకు వలస వెళ్లిపోవడంతో దినేష్‌ తాత ఇంటి వద్దే ఉంటున్నాడు. గత నెలలో చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చింది. అది కాస్తా బోన్‌మేరో అని తెలియడంతో తల్లిదండ్రులు బిక్కచచ్చిపోయారు. బాలుడిని పరీక్షించిన శ్రీకాకుళంలోని వైద్యులు తమిళనాడులోని వెల్లూరు క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అక్కడకు వెళ్లాకే వ్యాధి బయటపడింది. ఆపరేషన్‌ చేస్తే బాలుడు బతుకుతాడని, ఆపరేషన్‌కు రూ.14 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు.
 
అయితే తమకు అంత స్థోమత లేదని ఆ దంపతులు చెప్పడంతో శస్త్రచికిత్సకు కావాల్సిన సగం మొత్తాన్ని ఆస్పత్రి గ్రాంటు నుంచి వచ్చేలా తాము సాయపడతామని మిగిలిన మొత్తాన్ని సర్దుబాటు చేయాలని వైద్యులు సూచించారు. దీంతో తల్లిదండ్రులు ఆ రిపోర్టులు పట్టుకుని సాయం కోసం వేడుకుంటున్నారు. ఎవరైనా సాయం చేయకపోతారని అని ఆశగా ఎదురుచూస్తున్నారు. స్థానికులు స్పందించి వీరికి సాయం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలోనూ వీరి గురించి ప్రచారం చేస్తున్నారు. సాయం చేయాలనుకునే వారు 9701882418, 9912254195 నంబర్లను సంప్రదించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement