నేటి నుంచి నవ్యాంధ్ర పుస్తక సంబరాలు | Book fest from today at Nellore | Sakshi
Sakshi News home page

నేటి నుంచి నవ్యాంధ్ర పుస్తక సంబరాలు

Nov 4 2016 11:11 PM | Updated on Oct 20 2018 6:19 PM

నేటి నుంచి నవ్యాంధ్ర పుస్తక సంబరాలు - Sakshi

నేటి నుంచి నవ్యాంధ్ర పుస్తక సంబరాలు

నెల్లూరు(అర్బన్‌): నగరంలోని వీఆర్‌ కళాశాల మైదానంలో శనివారం నుంచి 9 రోజుల పాటు నవ్యాంధ్ర పుస్తక సంబరాలను నిర్వహించనున్నారు.

  • 90 స్టాల్స్‌ ఏర్పాటు 
  • ప్రతిరోజు విద్యార్థులకు పోటీలు 
  • బ్రోచర్లు ఆవిష్కరించిన నిర్వాహకులు
  •  
    నెల్లూరు(అర్బన్‌): నగరంలోని వీఆర్‌ కళాశాల మైదానంలో శనివారం నుంచి 9 రోజుల పాటు నవ్యాంధ్ర పుస్తక సంబరాలను నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని, సాహిత్యాభిలాషను పెంపొందించేందుకు, మాతృభాషను కాపాడుకునేందుకు   పుస్తక సంబరాలు నిర్వహిస్తున్నామని విజయవాడ బుక్స్‌ ఫెస్టివల్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య తెలిపారు. వీఆర్‌ కళాశాలలో పుస్తక ప్రదర్శనకు సంబంధించిన బ్రోచర్లను నిర్వాహకులు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 55 ఏళ్ల చరిత్రలో నెల్లూరులో తొలిసారిగా  ఎన్టీఆర్‌ ట్రస్టు, ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సహకారంతో పుస్తక సంబరాలను నిర్వహిస్తున్నామన్నారు. దేశంలోని కలకత్తా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీస్థాయిలో పుస్తక సంబరాలు జరుగుతాయన్నారు. అందుకే అక్కడ మాతృభాష ఫరిడవిల్లుతోందన్నారు. అదే విధంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పుస్తక సంబరాలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. నెల్లూరులో 90 స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు ఎగ్జిక్యూటీవ్‌ ఆర్‌ రామకృష్ణ మాట్లాడుతూ రోజూ విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 8 రకాల  పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. విజేతలకు బహుమతులను 50శాతం పుస్తకాలు, 50శాతం నగదు రూపంలో ఇస్తామన్నారు. పుస్తకాలు కొనుగోలు చేసిన వారికి ప్రతిరోజు లక్కీ డ్రా తీసి బహుమతులు అందజేస్తామన్నారు. డిగ్రీ చదివిన విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై చెన్నై, బెంగళూరుకు చెందిన నిపుణులు సదస్సులు నిర్వహిస్తారని తెలిపారు. 8న నగరంలో పుస్తక పాదయాత్ర చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ బుక్స్‌ ఫెస్టివల్‌ కార్యదర్శి సాయిరాం,  ప్రముఖ కవి పెరుగు రామకృష్ణ, సాహితీవేత్త భాస్కర్‌రెడ్డి, మ్యూజికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement