పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన బొలెరో | bolero vehicle attacked in wedding cermony | Sakshi
Sakshi News home page

పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన బొలెరో

Aug 16 2016 2:07 AM | Updated on Sep 4 2017 9:24 AM

పెళ్లి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. యువకుడిని వాహనం ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు.

యువకుడి మృతి, ఆరుగురికి తీవ్రగాయాలు

 దోమకొండ: పెళ్లి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. యువకుడిని వాహనం ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం సీతారంపల్లి గ్రామానికి చెందిన చేరుకు సిద్ధరాములు వివాహం ఆదివారం జరిగింది. రాత్రి గ్రామంలో ఊరేగింపు వెళ్తుండగా పెళ్లి సామగ్రితో కూడిన బొలెరో వాహనాన్ని డ్రైవర్ కరుణాకర్ అక్కడే నిలిపి దూరంగా వెళ్లాడు. అదేసమయంలో మద్యం మత్తు లో ఉన్న జనగామ శ్రీనివాస్ అనే వ్యక్తి వాహనాన్ని స్టార్ట్‌చేయగా, అది పెళ్లి ఊరేగింపు మీదుగా దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన అకారం నవీన్(17) అక్కడిక క్కడే మృతి చెందాడు.

పెళ్లి కుమారుడి తండ్రి చిన్న గంగయ్య, బంధువులు చిన్న ఏల్లం, జాలిగాం కార్తీక్, గోవిందపురం నవీన్, గంగిరెడ్డి రాకేష్, బట్టు పరశురాములకు తీవ్ర గాయాలైనాయి. వీరిలో సంఘమేశ్వర్ గ్రామానికి చెందిన బట్టు పరశురాములకు తీవ్ర గాయాలు కాగా, హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మిగతా వారిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో చేర్పిం చారు. ప్రమాదానికి కారణమైన జనగామ శ్రీనివాస్‌తో పాటు వాహన డ్రైవర్ కరుణాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు నవీన్ గ్రామంలో కూలీ పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement