మేం నల్లధనాన్ని సర్దుకోలేదు | black money reaction yanamala | Sakshi
Sakshi News home page

మేం నల్లధనాన్ని సర్దుకోలేదు

Nov 9 2016 11:57 PM | Updated on Aug 27 2018 8:44 PM

మేం నల్లధనాన్ని సర్దుకోలేదు - Sakshi

మేం నల్లధనాన్ని సర్దుకోలేదు

అంగర (కపిలేశ్వరపురం) : టీడీపీ, బీజేపీ తమ నల్లధనాన్ని సర్దుకున్నాకా నోట్లు రద్దు నిర్ణయాన్ని ప్రకటించారంటూ కమ్యూనిస్టు పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మండలంలోని పడమర ఖండ్రిక, అంగర గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం పాల్గొన్నారు

మంత్రి యనమల 
అంగర (కపిలేశ్వరపురం) : టీడీపీ, బీజేపీ తమ నల్లధనాన్ని సర్దుకున్నాకా నోట్లు రద్దు నిర్ణయాన్ని ప్రకటించారంటూ కమ్యూనిస్టు పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మండలంలోని పడమర ఖండ్రిక, అంగర గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం పాల్గొన్నారు. రూ.500, రూ.వెయ్యి నోట్లు రద్దు చేయడం ద్వారా నల్లధనం వెలికితీయోచ్చని యనమల అన్నారు. పడమర ఖండ్రికలో పంచాయతీ భవనం, అంగరలోని పోలీస్‌ స్టేషన్‌ భవనం, వాటర్‌ ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌లను మంత్రులు ప్రారంభించారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ వీవీవీ చౌదరి, జెడ్పీ చైర్మన్‌ నామన రాంబాబు, ఎంపీపీ కాదా వెంకట రాంబాబు, జెడ్పీటీసీ జుత్తుక సూర్యావతి, జేసీ సత్యనారాయణ, ఆర్డీఒ సుబ్బారావు,  పువ్వల చిట్టిబాబు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, డీఎస్పీ మురళీకృష్ణ, ఎస్‌సై వాసా పెద్దిరాజు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement