రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీ కృషి | BJP working for state development | Sakshi
Sakshi News home page

రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీ కృషి

Aug 1 2016 11:32 PM | Updated on Mar 29 2019 9:31 PM

రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీ కృషి - Sakshi

రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీ కృషి

నెల్లూరు(బారకాసు): రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీ పనిచేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి పేర్కొన్నారు. మినీ బైపాస్‌రోడ్డులోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు.

 
నెల్లూరు(బారకాసు): రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీ పనిచేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి పేర్కొన్నారు. మినీ బైపాస్‌రోడ్డులోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్య్రానంతరం ఏ కేంద్ర ప్రభుత్వం చేయనంతగా ప్రధాన నరేంద్రమోదీ నాయకత్వంలో రాష్ట్రానికి అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తున్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా పేరుతో అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు.
కార్పొరేషన్‌ను సంపూర్ణ ప్రక్షాళన చేయాలి
కార్పొరేషన్‌ను సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తేనే పరిపాలన సవ్యంగా సాగుతుందని, మంత్రి నారాయణ దీనిపై చర్యలు తీసుకోవాలని కర్నాటి ఆంజనేయరెడ్డి డిమాండ్‌ చేశారు. గ్రూపు రాజకీయాలతో కార్పొరేషన్‌ పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండేళ్లలో ముగ్గురు కమిషనర్లను మార్పించడం ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం పంపుతున్నారో అర్థం కావడంలేదని చెప్పారు. బీజేపీ నేతలు కుడుమల సుధాకర్‌రెడ్డి, శ్రీనివాసులుగౌడ్, నరసింహులునాయుడు, శ్రీనివాసులు, అంగీర్‌ జనార్దన్, కాయల మధు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement