మండలంలోని నడికూడలో దొంగలు మంగళవారం రాత్రి హల్‌చల్ చేశారు. గ్రామంలోని ఓ బైక్‌ను అపహరించారు. మరో బైక్‌ను అపహరించేందుకు విఫల యత్నం చేశారు.
నడికూడలో బైక్ చోరీ
Aug 4 2016 12:16 AM | Updated on Sep 4 2017 7:40 AM
	పరకాల : మండలంలోని నడికూడలో దొంగలు మంగళవారం రాత్రి హల్‌చల్ చేశారు. గ్రామంలోని ఓ బైక్‌ను అపహరించారు. మరో బైక్‌ను అపహరించేందుకు విఫల యత్నం చేశారు. బాధితుల కథనం ప్రకారం.. నడికూడకు చెందిన టీఆర్‌ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఊర రవీందర్‌రావు, చింతలపల్లి భీమ్‌రావులు తమ ఇళ్ల ఎదుట బైక్‌లను నిలిపారు. కాగా, రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వాటిని అపహరించారు. అయితే గ్రామ శివారులోని ఓ పత్తి చేనులో భీమ్‌రావు బైక్ కనిపించింది.  రవీందర్‌రావు బైక్ మాత్రం ఎంత వెతికినా దొరకలేదు. దీంతో ఆయన బుధవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
