బైక్‌ను ఢీకొన్న లారీ | bike hit by lorrry | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న లారీ

Oct 18 2016 1:36 AM | Updated on Sep 4 2017 5:30 PM

బైక్‌ను ఢీకొన్న లారీ

బైక్‌ను ఢీకొన్న లారీ

శంకరనగర్‌ (సోమశిల) :మితిమీరిన వేగంతో వెళ్తున్న లారీని ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన అనంతసాగరం మండలంలోని శంకరనగర్‌ వద్ద సోమవారం రాత్రి జరిగింది.స్థానికుల కథనం మేరకు..

 
-  యువకుడు దుర్మరణం
- ఇద్దరికి గాయాలు 
శంకరనగర్‌ (సోమశిల) :మితిమీరిన వేగంతో వెళ్తున్న లారీని ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన అనంతసాగరం మండలంలోని శంకరనగర్‌ వద్ద సోమవారం రాత్రి జరిగింది.స్థానికుల కథనం మేరకు.. మండలంలోని రేవూరు ఈగాపాళెంకు చెందిన దూపాటి గోపాల్, రేణంగి వెంకటేశ్వర్లు, రేణంగి వేణు (20) ఆత్మకూరు నుంచి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తున్నారు. అదే సమయంలో అనంతసాగరం నుంచి ఆత్మకూరుకు వెళ్తున్న ధాన్యం లారీ శంకర్‌నగర్‌ సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొంది. ఈ దుర్ఘటనలో వేణు అక్కడికక్కడే  దుర్మరణం చెందగా, రేణంగి వెంకటేశ్వర్లు, గోపాల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్వర్లు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంఘటనా స్థలాన్ని అనంతసాగరం ఎస్‌ఐ రఘునాథ్‌ పరిశీలించారు.
రెండు నిమిషాల్లో ఇంటికి చేరుకునే వాళ్లు..
ప్రమాదం జరిగిన స్థలానికి స్వగ్రామానికి కేవలం 3 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రమాదం జరగకుండా ఉంటే.. రెండు నిమిషాల్లో గమ్యస్థానం చేరేవాళ్లు. అంతలోనే ప్రమాదం జరగడంతో విషయం తెలిసి గ్రామస్తులు పలువురు అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలు మారుమోగాయి.
 వేణు చదువు కోసం కువైట్‌కు వెళ్లిన అన్న 
 మృతుడు రేణంగి వేణు తండ్రి నారాయణ ఐదేళ్ల క్రితం మరణించాడు. తల్లి వికలాంగురాలు కావడంతో కుటుంబ పోషణ కష్టమైంది. దీంతో వేణును బాగా చదివించాలనే  తపనతో అతని అన్న వెంకటేశ్వర్లు ఏడాది క్రితం అప్పు చేసి కువైట్‌కు వెళ్లాడు. అందరితో అనోన్యంగా ఉండే వేణు మృతితో కుటుంబం శోకసముద్రమైంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement