చాకరిమెట్లలో బన్వర్‌లాల్‌ పూజలు | bhanwarlal at chakarimetla | Sakshi
Sakshi News home page

చాకరిమెట్లలో బన్వర్‌లాల్‌ పూజలు

Aug 18 2016 9:54 PM | Updated on Sep 4 2017 9:50 AM

ఆంజనేయస్వామికి పూజలు

ఆంజనేయస్వామికి పూజలు

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్‌లాల్‌ కుటుంబ సమేతంగా ప్రసిద్ధి చెందిన చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయస్వామిని గురువారం రాత్రి దర్శించుకున్నారు.

శివ్వంపేట: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్‌లాల్‌ కుటుంబ సమేతంగా ప్రసిద్ధి చెందిన చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయస్వామిని గురువారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయ ఫౌండర్‌, చైర్మన్‌ ఆంజనేయశర్మ పూర్ణకుంభంతో బన్వర్‌లాల్‌ దంపతులకు స్వాగతం పలికారు.

అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా బన్వర్‌లాల్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ఆంజనేయస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే ఓటరు నమోదు కార్యక్రమం నిర్వమిస్తామన్నారు. కార్యక్రమంలో అర్చకులు రాధాకిషన్‌రావు శర్మ, సిబ్బంది రామకృష్ణ ఉన్నారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement