'లేదంటే చంద్రబాబుపై పోరాటం తప్పదు' | bc leaders meeting with justice manjunath | Sakshi
Sakshi News home page

'లేదంటే చంద్రబాబుపై పోరాటం తప్పదు'

Jul 13 2016 5:09 PM | Updated on Sep 4 2017 4:47 AM

కాపులను బీసీల్లో కలప వద్దని ఆంధ్రప్రదేశ్ బీసీ కమీషన్ చైర్మన్ మంజునాథకు బీసీ చైతన్య వేదిక సభ్యులు విజ్ఞప్తి చేశారు.

విజయవాడ : కాపులను బీసీల్లో కలప వద్దని ఆంధ్రప్రదేశ్ బీసీ కమీషన్ చైర్మన్ మంజునాథకు బీసీ చైతన్య వేదిక సభ్యులు విజ్ఞప్తి చేశారు. బుధవారం విజయవాడలో కమిషన్ చైర్మన్ మంజునాథతో బీసీ చైతన్య వేదిక సభ్యులు భేటీ అయ్యారు. అనంతరం బీసీ చైతన్య వేదిక సభ్యులు విలేకర్లతో మాట్లాడుతూ...  ఓట్లు, సీట్ల కోసం చంద్రబాబు కాపులను బీసీలలో కలపాలని చూస్తున్నారని విమర్శించారు.

కాపులను బీసీల్లో కలిపితే ఊరుకునేది ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. బీసీ మంత్రలు, ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి బయటికి వచ్చి తాము చేస్తోన్న పోరాటానికి మద్ధతు తెలపాలని కోరారు. కాపులను బీసీల్లో చేరుస్తామన్న బాబు... తన నిర్ణయాన్ని 10 రోజుల్లో ఉపసంహరించుకోవాలని బీసీ చైతన్య వేదిక సభ్యులు డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబుపై పోరాటం తప్పదని వారు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement