‘బాస్కెట్‌ బాల్‌’ విజేత జేకేసీ జట్టు | Basket ball trophy winner JKC team | Sakshi
Sakshi News home page

‘బాస్కెట్‌ బాల్‌’ విజేత జేకేసీ జట్టు

Oct 25 2016 6:09 PM | Updated on Sep 4 2017 6:17 PM

‘బాస్కెట్‌ బాల్‌’ విజేత జేకేసీ జట్టు

‘బాస్కెట్‌ బాల్‌’ విజేత జేకేసీ జట్టు

జాగర్లమూడి నరేంద్రనాథ్‌ మెమోరియల్‌ బాస్కెట్‌బాల్‌ జిల్లా స్థాయి టోర్నమెంట్‌ సోమవారం ముగిసింది.

గుంటూరు స్పోర్ట్స్‌: జాగర్లమూడి నరేంద్రనాథ్‌ మెమోరియల్‌ బాస్కెట్‌బాల్‌ జిల్లా స్థాయి టోర్నమెంట్‌ సోమవారం ముగిసింది. స్కూల్‌ స్థాయి బాలికల విభాగంలో జేకేసీ జట్టు విజేతగా నిలువగా, కేకేఆర్‌ గౌతమ్‌ స్కూల్‌ జట్టు రన్నరప్‌ టైటిల్‌ సాధించింది. బాలుర విభాగంలో లయోలా స్కూల్‌ జట్టు విజేతగా నిలువగా, లయోలా–బి జట్టు రన్నరప్‌గా నిలిచింది. కళాళాల స్థాయి పురుషుల విభాగంలో నలందా ఇంజినీరింగ్‌ కాలేజీ  టైటిల్‌ సాధించగా, ఏసీ కళాశాల జట్టు రన్నరప్‌గా నిలిచింది. అనంతరం స్థానిక బృందావన్‌ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎల్‌వీఆర్‌ క్లబ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌ విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement