బ్యాడ్మింటన్‌ ఎంపిక పోటీలు ప్రారంభం | badminton selections start | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్‌ ఎంపిక పోటీలు ప్రారంభం

Sep 21 2016 9:43 PM | Updated on Sep 4 2017 2:24 PM

బ్యాడ్మింటన్‌ ఎంపిక పోటీలు ప్రారంభం

బ్యాడ్మింటన్‌ ఎంపిక పోటీలు ప్రారంభం

భీమవరం : జేఎన్‌టీయూకే యూనివర్శిటీ బ్యాడ్మింటన్‌ జట్టు ఎంపిక పోటీలు స్థానిక డీఎన్నార్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బుధవారం ప్రారంభమయ్యాయి.

భీమవరం : జేఎన్‌టీయూకే యూనివర్శిటీ బ్యాడ్మింటన్‌ జట్టు ఎంపిక పోటీలు స్థానిక డీఎన్నార్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బుధవారం ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ స్పోర్ట్స్‌ కమిటీ సెక్రటరీ డాక్టర్‌ జి.శ్యామ్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ ఏడాది నిర్వహించే బ్యాడ్మింటన్‌ పోటీలకు జట్లను ఎంపిక చేస్తున్నట్టు చెప్పారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు వచ్చేనెలలో తమిళనాడు మధురై కామరాజు యూనివర్శిటీలో జరగనున్న సౌత్‌ జోన్‌ ఇంటర్‌ యూనివర్శిటీ టోర్నమెంట్‌ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ యు.రంగరాజు, సెలక్షన్‌ కమిటీ సభ్యుడు వై.నానిప్రసాద్, సీహెచ్‌ ^è ంద్రశేఖర్, సెలక్షన్‌ కమిటీ సెక్రటరీ పి.నర్సింహరాజు, బి.నర్సింహరాజు, పి.కిరణ్‌కుమార్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.  
 
 

Advertisement
 
Advertisement
Advertisement