breaking news
dnr collage
-
అథ్లెటిక్స్ చాంప్ ‘డీఎన్నార్’
భీమవరం టౌన్: ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను భీమవరం డీఎన్నార్ కళాశాల విద్యార్థులు కైవసం చేసుకున్నారని ప్రిన్సిపాల్ పి.రామకృష్ణంరాజు గురువారం తెలిపారు. ఉభయగోదావరి జిల్లాల్లోని 46 కళాశాలలకు చెందిన విద్యార్థులు పోటీల్లో తలపడగా డీఎన్నార్ విద్యార్థులు సత్తాచాటారని చెప్పారు. ఆరేళ్ల తర్వాత డీఎన్నార్ కళాశాల చాంపియన్‌షిప్‌ను సాధించిందన్నారు. పీడీ నర్సింహరాజు మాట్లాడుతూ తమ విద్యార్థులు 800 మీటర్లు, 1,500 మీటర్లు పరుగు, 4 టు 400 రిలేలో మొదటి స్థానాలు, 1,500 మీటర్లు డిస్కస్‌త్రో, 400 మీటర్ల పరుగు, హాల్ట్ మార్తాన్, జావెలిన్‌త్రో 4 టు 100 రిలేలో ద్వితీయ స్థానాలు, 200 మీటర్లు, 1,000 మీటర్ల పరుగులో మూడో స్థానంలో నిలిచి మొత్తంగా 42 పాయింట్లతో చాంపియన్‌షిప్ సాధించిందన్నారు. తమ విద్యార్థులు ఎన్.జగన్మోహనరావు, కె.దుర్గానటరాజ్, సీహెచ్ రవీంద్రబాబు, డి.వెంకటేష్ వచ్చేనెల 11వ తేదీ నుంచి తమళినాడు కోయంబత్తూరులో జరిగే ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ మీట్లో పాల్గొంటారని చెప్పారు. వీరిని కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు జీవీ నర్సింహరాజు, కార్యదర్శి జి.సత్యనారాయణరాజు అభినందించారు. -
బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు ప్రారంభం
భీమవరం : జేఎన్టీయూకే యూనివర్శిటీ బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక పోటీలు స్థానిక డీఎన్నార్ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ స్పోర్ట్స్ కమిటీ సెక్రటరీ డాక్టర్ జి.శ్యామ్‌కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది నిర్వహించే బ్యాడ్మింటన్ పోటీలకు జట్లను ఎంపిక చేస్తున్నట్టు చెప్పారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు వచ్చేనెలలో తమిళనాడు మధురై కామరాజు యూనివర్శిటీలో జరగనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్శిటీ టోర్నమెంట్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ యు.రంగరాజు, సెలక్షన్ కమిటీ సభ్యుడు వై.నానిప్రసాద్, సీహెచ్ ^è ంద్రశేఖర్, సెలక్షన్ కమిటీ సెక్రటరీ పి.నర్సింహరాజు, బి.నర్సింహరాజు, పి.కిరణ్‌కుమార్ వర్మ తదితరులు పాల్గొన్నారు.