అతడు అభం శుభం ఎరుగని చిన్నారి. పేరు శివ కేశవ్. వయసు కేవలం రెండేళ్లు. విశాఖపట్నంలోని హార్బర్ పార్కులో ఆడుకోడానికి వచ్చినప్పుడు అక్కడున్న వీధికుక్కలు ఒక్కసారిగా అతడి మీద పడి కరిచాయి.
అతడు అభం శుభం ఎరుగని చిన్నారి. పేరు శివ కేశవ్. వయసు కేవలం రెండేళ్లు. విశాఖపట్నంలోని హార్బర్ పార్కులో ఆడుకోడానికి వచ్చినప్పుడు అక్కడున్న వీధికుక్కలు ఒక్కసారిగా అతడి మీద పడి కరిచాయి. దాంతో అతడిని ఆస్పత్రికి తరలించినా, అప్పటికే మరణించాడు.
సాయంత్రం 6.15 గంటలకు ఆ చిన్నారిని ఆస్పత్రికి తీసుకొచ్చారని, కానీ అప్పటికే అతడికి ప్రాణం లేదని కేజీహెచ్ సీఎంఓ అరుణ తెలిపారు. బాలుడి శరీరంపై దాదాపు 200 వరకు కుక్క కాట్లు ఉన్నాయని, పేగులు కూడా బయటకు వచ్చేశాయని ఆమె చెప్పారు.


