బీఈడీ విద్యార్థిని బలవన్మరణం | B.Ed student suicide in srikakulam | Sakshi
Sakshi News home page

బీఈడీ విద్యార్థిని బలవన్మరణం

Aug 11 2015 11:35 AM | Updated on Nov 6 2018 7:56 PM

శ్రీకాకుళం పట్టణంలో బీఈడీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.

శ్రీకాకుళం : శ్రీకాకుళం పట్టణంలో బీఈడీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన పట్టణంలోని పీఎన్ కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. పీఎన్ కాలనీకి చెందిన విద్యాధరి (22) స్థానిక శ్రీ వెంకటేశ్వర కాలేజీలో బీఈడీ చదువుతోంది.

అయితే ఆమె మంగళవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య కారణంగానే ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement