బీ.ఈడీ విద్యార్థిని అదృశ్యం | B.Ed Student missing | Sakshi
Sakshi News home page

బీ.ఈడీ విద్యార్థిని అదృశ్యం

Aug 13 2015 5:27 PM | Updated on Sep 3 2017 7:23 AM

పరీక్ష రాసేందుకని ఇంటి నుంచి వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది.

రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్) : పరీక్ష రాసేందుకని ఇంటి నుంచి వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది. ఈ ఘటన మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై వేణుగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం... గాస్మండి ప్రాంతానికి చెందిన ఎల్కపల్లి దేవయ్య కుమార్తె స్రవంతి (21)ఆర్‌జీఆర్ సిద్దాంతి కళాశాలలో బీఈడీ చదువుతోంది. కాగా ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం తనకు బీఈడీ పరీక్ష ఉందని ఇంట్లో చెప్పి వెళ్లింది.

అయితే సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు.. బంధువులు, తెలిసిన వారి దగ్గర వెతికారు. అయినా లాభం లేకపోవడంతో బుధవారం సాయంత్రం మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు 040-27853598, 9490598916 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement