breaking news
B.Ed student
-
బీ.ఈడీ విద్యార్థిని అదృశ్యం
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్) : పరీక్ష రాసేందుకని ఇంటి నుంచి వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది. ఈ ఘటన మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై వేణుగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం... గాస్మండి ప్రాంతానికి చెందిన ఎల్కపల్లి దేవయ్య కుమార్తె స్రవంతి (21)ఆర్జీఆర్ సిద్దాంతి కళాశాలలో బీఈడీ చదువుతోంది. కాగా ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం తనకు బీఈడీ పరీక్ష ఉందని ఇంట్లో చెప్పి వెళ్లింది. అయితే సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు.. బంధువులు, తెలిసిన వారి దగ్గర వెతికారు. అయినా లాభం లేకపోవడంతో బుధవారం సాయంత్రం మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు 040-27853598, 9490598916 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. -
బీఈడీ విద్యార్థిని బలవన్మరణం
శ్రీకాకుళం : శ్రీకాకుళం పట్టణంలో బీఈడీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన పట్టణంలోని పీఎన్ కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. పీఎన్ కాలనీకి చెందిన విద్యాధరి (22) స్థానిక శ్రీ వెంకటేశ్వర కాలేజీలో బీఈడీ చదువుతోంది. అయితే ఆమె మంగళవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య కారణంగానే ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.