నెల్లూరు (టౌన్): ప్రణాళిక బద్ధంగా చదివితేనే బ్యాంకింగ్ వ్యవస్థలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని శ్రీసాయి గురురాఘవేంద్ర బ్యాం కింగ్ కోచింగ్ సెంటర్ చైర్మన్ పి.దస్తగిరిరెడ్డి తెలిపారు. స్థానిక కేవీ ఆర్ పెట్రోలు బంక్ సమీపంలోని స్వర్ణవేదిక కల్యాణమండపంలో శుక్రవారం శ్రీసాయి గురురాఘవేంద్ర బ్యాంకిం గ్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ ఉద్యోగాలపై విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు.
ప్రణాళికతోనే బ్యాంకింగ్‌లో ఉద్యోగావకాశాలు
Aug 13 2016 12:38 AM | Updated on Sep 4 2017 9:00 AM
నెల్లూరు (టౌన్): ప్రణాళిక బద్ధంగా చదివితేనే బ్యాంకింగ్ వ్యవస్థలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని శ్రీసాయి గురురాఘవేంద్ర బ్యాం కింగ్ కోచింగ్ సెంటర్ చైర్మన్ పి.దస్తగిరిరెడ్డి తెలిపారు. స్థానిక కేవీ ఆర్ పెట్రోలు బంక్ సమీపంలోని స్వర్ణవేదిక కల్యాణమండపంలో శుక్రవారం శ్రీసాయి గురురాఘవేంద్ర బ్యాంకిం గ్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ ఉద్యోగాలపై విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత బ్యాంకు ఉద్యోగాలపై దృష్టి సారించాలన్నారు. రానున్న రోజుల్లో వేల సంఖ్యలో బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగాలు సాధించాలంటే సమయపాల, ఏకాగ్రత ముఖ్యమని చెప్పారు. బ్యాంకింగ్ ఉద్యోగాలకు అర్థమెటిక్ రీజనింగ్, ఇంగ్లీషు, భావవ్యక్తీకరణను పెం పొందించుకోవాలని సూచించారు. ప్రధానంగా ప్రిపిరేషన్, ఇంట ర్వ్యూలు, ఆన్‌లైన్ ఎగ్జామ్స్‌పై అవగాహన పెంచుకోవాలన్నారు. కోచింగ్ సెంటరులో ఆధునిక టెక్నాలజీతో కూడిన విధి విధానాలతో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు కోచింగ్ సెంటర్ ద్వారా 21వేల మంది ఉద్యోగాలు సాధించినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్, డీవీడీలను పంపిణీ చేశారు. కోచింగ్ సెంటర్ డైరెక్టర్ షేక్షావలిరెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement