ఆటో, మోటార్‌ డ్రైవర్స్‌ యూనియన్ ఆవిర్భావం | Auto, Motor Drivers Union emergence | Sakshi
Sakshi News home page

ఆటో, మోటార్‌ డ్రైవర్స్‌ యూనియన్ ఆవిర్భావం

Feb 25 2017 11:11 PM | Updated on Mar 28 2018 11:26 AM

ఆటో, మోటార్‌ డ్రైవర్స్‌ యూనియన్  ఆవిర్భావం - Sakshi

ఆటో, మోటార్‌ డ్రైవర్స్‌ యూనియన్ ఆవిర్భావం

తెలంగాణ ఆటో మోటార్‌ డ్రైవర్స్, ట్రాన్స్ పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్ కొత్త సంఘం శుక్రవారం ఆవిర్భవించింది.

గన్ ఫౌండ్రీ: తెలంగాణ ఆటో మోటార్‌ డ్రైవర్స్, ట్రాన్స్ పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్  కొత్త సంఘం శుక్రవారం ఆవిర్భవించింది. ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఎస్‌.దయానంద్, ప్రధాన కార్యదర్శిగా అమ్జద్‌ ఎన్నికయ్యారు. బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన ఆవిర్భావ సభలో యూనియన్  లోగోను అధ్యక్ష, కార్యదర్శులు ఆవిష్కరించారు. అనంతరం దయానంద్‌ మాట్లాడుతూ... త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండల స్థాయిలో సభ్యత్వ నమోదు చేపడతామన్నారు. 

టీఆర్‌ఎస్‌కు అనుబంధంగా తమ సంఘం పని చేస్తుందని ప్రకటించారు. ప్రభుత్వ విధానాలపైనే కాకుండా ఆర్టీఏ అధికారుల జులుం,   ట్రాఫిక్‌ పోలీసుల వేధింపులు, ఫైనాన్షియర్‌ల దోపిడీకి వ్యతిరేకంగా కూడా పోరాటం చేస్తామనన్నారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ నాయకులుగా మున్నాభాయ్, జహంగీర్, గణేష్, రాజ్, సతీష్‌ ఎన్నికైనట్టు తెలిపారు.

Advertisement

పోల్

Advertisement